సరూర్‌నగర్‌ సభకు హైకోర్టు అనుమతి

సరూర్‌నగర్‌ సభకు హైకోర్టు అనుమతి


హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మిక సంఘాలు బుధవారం తలపెట్టిన 'సకల జనుల సమరభేరి'కి హైకోర్టు అనుమతించింది. సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించనున్న ఈ సభకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని సూచించింది. అంతకుముందు సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో కార్మిక సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.*