జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు డి ఎస్ పి గారికి వినతి పత్రం

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు డి ఎస్ పి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది


కదిరి టౌన్ కోర్ట్ రోడ్ లోని గత 20 సంవత్సరాల నుంచి రోడ్డు పక్కన చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు ఆ స్థలానికి సంబంధించి మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నారు  విద్యుత్ బిల్లులు కూడా చెల్లిస్తున్నారు కదిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఈ స్థలాలను కాళీ చేయండి అని చెప్పడం జరిగింది లేదంటే మేమే తీసి వేస్తామని చెప్పడం జరిగింది ఆ స్థలాన్ని ఖాళీ చేసినట్లయితే ఆ కుటుంబాలు వీధిన పడతాయని వారికి ఎటువంటి జీవనాధారం కూడా లేదు హుటాహుటిన ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడ వెళ్తారని అక్కడున్న చిరు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. కోర్ట్ రోడ్ లో చిన్న వాహనాలు మాత్రమే వెళ్తాయని దానివల్ల ట్రాఫిక్కు ఇబ్బంది ఉండదని చిరు వ్యాపారస్తులు చెబుతున్నారు వాళ్లకి ప్రత్యామ్నాయం చూపించేంత వరకు గడువు ఇవ్వాలని జనసేన పార్టీ తరపున చిరు వ్యాపారులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బైరవ ప్రసాద్ అను ప్రసాద్ చక్క రమణ కిన్నెర మహేష్ నాగరాజు లక్ష్మణ్ చిరు వ్యాపారస్తు లు ముస్తఫా,గణేష్, వెంకట రమణమ్మ,లక్మిదేవి,భరత్ కుమార్, కలీల్ ,హైదర్, షోకత్,తదితరులు పాల్గొన్నారు