తెదేపా హయాంలో నారా లోకేష్ మంత్రిత్వ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణాభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. అప్పట్లోనే మన రాష్ట్ర పంచాయితీలు దేశంలోనే ఆదర్శ పంచాయతీలుగా నిలిచి ఎన్నో అవార్డులు సాధించాయి. ఐదేళ్ల కాలంలో గ్రామీణాభివృద్ధిలో 97 అవార్డులు సాధిస్తే... అందులో 66 అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే కావటం గమనార్హం. నారా లోకేష్ నాడు చేసిన కృషి నేటికీ ప్రశంసలు, అవార్డులు అందుకుంటూనే ఉంది.
గ్రామీణాభివృద్ధిలో కీలకమైన పంచాయితీలు, మండలాలు, జిల్లా పరిషత్తుల పనితీరు ఆధారంగా ఏటా ఇచ్చే 'జాతీయ పంచాయతీ పురస్కారాలు-2019'కు సంబంధించి నాలుగు విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ 14 అవార్డులను సాధించింది. ఈ అవార్డులను 2017-18 సంవత్సరంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ప్రణాళికల అమలు, పనితీరు ఆధారంగా ఇవ్వడం గమనార్హం.
చిత్తూరు జిల్లా పరిషత్తుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ పురస్కారం (DDUPSP) వచ్చింది. DDUPSP మండల పరిషత్తు విభాగంలో గుమ్మగట్ట, సబ్బవరం, వెదురుకుప్పం, కర్నూలు మండల పరిషత్తులకు అవార్డులు వచ్చాయి. పంచాయితీల విభాగంలో పొగిరి, బుట్టాయగూడెం, కూచివారిపల్లి, అచ్చంపేట, తాల్వాయిపాడు, కోనంకి పంచాయితీలకు అవార్డులు వచ్చాయి.