నందిగామ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది

నందిగామ ... శుక్రవారం తెల్లవారుజామున నందిగామ నియోజకవర్గంలో భారీ స్థాయిలో వర్షం కురిసింది దింతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి నందిగామ శివారులో వాగులు వంకలు పొంగి ప్రవహించాయి దింతో అనాసాగరం నుంచి పెనుగంచిప్రోలు మండలాన్నికి వెళ్ళే రహదారిపై వాగు పొంగడంతో రాకా పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అలాగే అడవిరావులపాడు చందాపురం గ్రామాల వద్ద నల్లవాగు పోంగుతుండటంతో చందర్లపాడు మండలాన్నికి రాకపోకలు లకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది అలాగే నందిగామ శివారు అనాసాగరం వద్ద వాగు పొంగడంతో పత్తి వరి పంటలు నీట మునిగి తేలుతున్నాయి పత్తి పంట సంగ వరుకు మునిగి నీరు పారుదల అవుతుండటంతో ఇప్పటికే కా‌సిన కాయలు నీట మునిగి నలుపు రంగు తిరిగి నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు అలాగే వరి పంట దుబ్బు దశలో ఉండగా ఇప్పటి కే కలుపు పెరిగి మరింత వ్యయం చేయవలసి ఉంటుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు అలాగే ఒక పక్క వైర మున్నేరు ఒకే సారి పై వర్షాలు కారణంగా పొంగి ప్రవహిస్తున్నాయి దింతో కృష్ణా ఖమ్మం జిల్లాల మధ్య రాకపోకలు నిలిచాయి అయితే నందిగామ లో కురిసిన వర్షాంకు పట్టణంలోని మురుగు కాల్వల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది డ్రైనేజీ కాలువలు పొంగడంతో మురుగు రోడ్లపై నిలిచి దుర్వాసన వస్తుంది నందిగామ లో 7 సెంటి మీటర్లల 30 మీల మీటర్ల కురిసింది.