అధికారి ముసుగులో అట్రాసిటీ* 

 


*అధికారి ముసుగులో అట్రాసిటీ* 


*ఏ మాఫియాతో చేతులు కలిపారు* 


*అటు అధికారం ఇటు కులం గుర్తింపు కార్డు రెండు పనిచేస్తున్నాయి ఆ అధికారికి*


ప్రభుత్వ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వ్యక్తి సామాజిక వర్గని అడ్డం పెట్టుకొని ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ  కేసులను మోపటం ఎంతవరకు ఎంతవరకు సబబు......ప్రశ్నించిన వారిని తన కులం కార్డుతో తప్పుడు కేసులు బనాయించి అట్రాసిటీ  నీ ఆయుధంగా 
వాడుకుంటున్నారు..?...ఇక్కడ జరుగుతున్న విధానాలపై జుడిషియల్ ఎంక్వైరీ వేయాలి......


విచారణ జరుగుతున్న సమయం లో నన్ను  నా కుటుంబాన్ని మానసికంగా వేధిస్తూ పత్రికా ప్రకటన ఎంతవరుకు సబబు...? 


నేనే కనుక బ్లాక్ మెయిల్ దందాలకు పాల్పడేవాడినే అయితే పోలీసు ల సహాయం, వివరణ కోరేవాడినే కాదు, సమాచారం అందించేవాడినే కాదు...!


నేను కనుక అధికారులను సహకరించమని అడిగేవాడినే అయితే భూకబ్జా దారులపై వార్తలు వ్రాసేవాడినా...ఇసుక మాఫియా ఫై వార్తలు వ్రాసేవాడినా.... మైనింగ్ మాఫియా ఫై వార్తలు వ్రాసేవాడినా....? 


నేను వయా మీడియాగా వ్యవహరించేవాడినే తప్పా మీడియా ముసుగులో మాఫియా సామ్రాజ్యాన్ని నడిపేవాడినే కాదు....? 


నాకు ప్రాణహాని ఉంది అని, నాపై తప్పుడు కేసులు బనాయిస్తారు అని గతంలోనే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్ పి, పోలీస్ కమిషనర్ వారికీ పెట్టాను. అందుకే మొదలైంది ఈ పదిరోజుల వి ఆర్ ఓ తో...!


అప్పుడే పై అధికారులు ఈ భూకబ్జా దారులు, మైనింగ్ మాఫియా పై చర్యలు తీసుకుంటే వాళ్ళ పై తప్పుడు కేసులు బనాయించేవారేమో....? 


ఆ వి ఆర్ ఓ పభుత్వ విధులలో చేరి పదిరోజులు కూడా కాలేదు పది సెక్షన్లతో కూడిన పిర్యాదు ఒక విలేకరిపై ఇవ్వటం వెనుక ఏయే మాఫియా ఉంది విచారణ ఎందుకు చేయటం లేదు...? 


ఒక ప్రభుత్వ అధికారి అట్రాసిటీ కేసులు పెట్టి విలేకరి లను సైతం భయబ్రాంతులకు గురిచేస్తే సామాన్య పేద ప్రజల మాటేంటి....? 


ఒక విలేకరి అడిగిన ప్రశ్నకే పది కేసులు పెడితే.. సామాన్య ప్రజలపై ఇంకెన్ని కేసులో...? 


వచ్చిన పదిరోజులకు అధికారులను సైతం హడలిస్తుంటే... ఎందుకు విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించటం లేదు...? 


ప్రభుత్వ ఉద్యోగులే అట్రాసిటిలు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తుంటే... ఈ జిల్లా పాలన ఎటుపోతోంది... రాష్ట్ర పాలన ఎటుపోతోంది...? 


దీని వెనుక ఏ మాఫియా ఉందొ... 484.. ఆ లేక ఇసుక మాఫియానా.... లేక.. మైనింగ్ మాఫియానా....? 


ఆ ఇద్దరి వి ఆర్ ఓ లపై వార్తలు వ్రాసినందుకు నాకు ఇన్ని సెక్షన్ల...? 


దేనికైనా ఎదుకోవటానికి నేను..నా యాజమాన్యం సైతం.. సిద్ధమే....!


అట్రాసిటీ కేస్ లు పెట్టినప్పుడు నిజనిర్ధారణ చేయవలిసిన ఎంతైనా ఉందా లేదా...? 


విచారణ పూర్తికాకుండానే నాపై నకిలీ విలేకరి అని వార్తలు వ్రాయించటం పై 484 లోని కొంతమంది వ్యక్తులు ఉన్నారు అనే అనుమానం వ్యక్తమవుతుంది..!


వి ఆర్ ఓ అంతా కలిసి మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి కల గళాని కి సంకెళ్లు వేసి నొక్కేద్దామని చూస్తున్నారా...? 


ఆ ఇద్దరి వి ఆర్ ఓ ల స్థితిగతు లపై వెలికి తీసిన నందుకు వాళ్లు ట్రాన్స్ఫర్లు అయ్యారు..నిజాలు వెలికి తీసినందుకేగా ఉన్నతాధికారులు వారిని బదిలీ చేసింది...మరి నిజాలు లేకపోతే...నాయి అసత్య వార్తలే అయితే పై అధికారులు కూడా అసత్యం గానే చేసారా...?