భవిష్యత్‌ ప్రణాళికపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది.
హైదరాబాద్: శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి బస్సులు, డ్రైవర్లను తెప్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.తెలంగాణా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీ ఆర్టీసీ కార్మికుల మద్దతు తెలిపారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం సరికాదని... ఉద్యోగులపై తెలంగాణ ప్రభుత్వ కక్ష సాధింపునకు పాల్పడితే ఏపీలోనూ ఆందోళన కార్యక్రమాలు ఈయూ నేత దామోదరరావు హెచ్చరించారు. ఇదిలా ఉంటే... తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్‌ ముగిసింది. ఇంతవరకు కార్మికులు విధుల్లో చేరలేదు. కాసేపట్లో భవిష్యత్‌ ప్రణాళికపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది.

 

శనివారం 6 గంటల్లోపు విధుల్లో చేరకపోతే ఉద్యోగులుగా గుర్తించబోమని కేసీఆర్ సర్కార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వారిని మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని అధికారులకు ప్రభుత్వం నిర్దేశించింది.