టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు

*విజయవాడ*


అయ్యా విజయసాయి రెడ్డి గారు...


ట్విట్టర్ లో ఇసుక కొరత లేదు అని మీరు సెలవిచ్చారు  బానే ఉంది, 


*మరి మీ మేధావి  ఇసుక వారోత్సవాలు ఎందుకు చేస్తున్నట్టు?*


మీ వైకాపా ఇసుక మాఫియా ట్రాక్టర్ డ్రైవర్లపై దాడులు చేసి ఇసుక ఎత్తుకుపోతున్నారు 


*అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడడంలేదు*


*రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి పందికొక్కుల్లా ఇసుకని తింటూ, భవన నిర్మాణ కార్మికులని మింగేస్తున్న మీరు ఇసుక గురించి నీతులు మాట్లాడుతున్నారా* 


పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదన్నట్లుగా ఉంది మీ వ్యవహారం. 


*దమ్ముంటే ఇసుక కొరత లేదని ప్రజల్లోకి వెళ్లి చెప్పండి ?*


అధికారం వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజలు ఛీ కొట్టడాన్ని భరించలేక జగన్ కి మతిస్థిమితం పోవడంతో మీకు మెదడు మోకాల్లోకి జారినట్టు ఉంది విజయసాయిరెడ్డి. 


*రాష్ట్రం ఆత్మహత్యలతో అట్టుడుకుతుంటే మీరు, మీ ముఖ్యమంత్రి గారు ఫిడేలు వాయించుకుంటున్నారు* 


మిమ్మల్ని చూసి సిగ్గే సిగ్గుపడుతుంది.


చంద్రబాబు  హయాంలో ముఖ్యమంత్రి ఈ-ఐ కేంద్రాల్లో ప్రజలు అంతా కంటి పరీక్షలు చేయించుకున్నారు


*ఇప్పుడు వైఎస్ఆర్ కంటి వెలుగు పథకంలో కంటి పరీక్ష చేయించుకోవాల్సింది మీరు ఒక్కరే విజయసాయిరెడ్డి!!*


మీకు చత్వారం రావడం వలనే అమరావతిలో జరిగిన నిర్మాణాలు కనపడటం లేదు. వయసుకూడా పెరుగుతోంది కదా


*అమరావతి గ్రాఫిక్స్ ఐతే, చంద్రబాబుగారు నిర్మించిన సచివాలయం నుండి పాలన ఎవరు చేస్తున్నట్టు?*  


హైకోర్టు గ్రాఫిక్ అంటున్నారు, త్వరలో  వెళ్తారుగా అప్పుడు మీకు మబ్బులు వీడడం ఖాయం.


*అధికారం వచ్చిన 5 నెలల్లో అమరావతిని ఎడారి చేసిన సిగ్గులేని జన్మ మీది,మీ సీఎం  గారిది విసారెడ్డి!*


డిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న


Popular posts