ఏదైనా ఒక కేసులో తీర్పివ్వాల్సిన న్యాయమూర్తికి... ఆ కేసులోని ఏదో ఒక పక్షంతో సన్నిహిత సంబంధాలున్నప్పుడు... ఆ న్యాయమూర్తి నిష్పాక్షికతపై సందేహాలకు ఆస్కారమున్నప్పుడు... ఆ కేసు విచారణనుండీ వైదొలగమని అవతలి పక్షం లాయర్ కోరవచ్చు... ఆ న్యాయమూర్తి వైదొలగుతాడు. ఇలా వైదొలగడాన్ని న్యాయపరిభాషలో Recuse అంటాం.
భీమా - కోరేగాం కేసులో నేరారోపణ ఎదుర్కొంటున్న ప్రముఖ జర్నలిస్టు గౌతం నవలఖా... తనపై మహారాష్ట్ర పోలీసులు వేసిన కేసును కొట్టేయమని అక్కడి హైకోర్టును కోరారు. వారందుకు అంగీకరించలేదు. కానీ తమ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు లో ఛాలెంజ్ చేయవచ్చని రిలీఫ్ ఇచ్చి, మూడు వారాలపాటు అరెస్టు చేయకుండా రక్షణ ఇచ్చారు.
అప్పటి నుండీ సుప్రీంకోర్టు ద్వారా ఆ కేసును కొట్టివేయించుకోవాలని నవలఖా ఐదుసార్లు సుప్రీంకోర్టు లోని వేరు వేరు జడ్జిల వద్ద పిటీషన్ వేసారు. ఐదుసార్లూ ఈ ఐదుమంది జడ్జిలు తాము ఈ కేసు విచారించలేమని ప్రకటించి తమను తామే recuse చేసుకుని తప్పుకున్నారు.
ఇదొక విచిత్ర విషమ పరిస్థితి.ఇందులోంచీ రెండు ప్రశ్నలు పుడుతున్నాయి.
1). కేసు గౌతం నవలఖాకూ మహారాష్ట్ర పోలీసులకూ (పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికీ )మధ్య ఐనప్పుడు ....
ఈ ఐదు మంది జడ్జిలకు ఏమి conflict of interest వుందని ,ఎవరూ కోరకుండానే... తమను తాము recuse చేసుకున్నారు? అంటే మేమంతా ప్రభుత్వం తరఫు అని వీళ్ళు బహిరంగంగా చెబుతున్నారా ?? లేక
గౌతం అనుకూలంగా తీర్పిస్తే జస్టిస్ లోయా కు పట్టిన గతే మాకూ పడుతుందని భయపడుతున్నారా ??
2)ఒకవేళ సుప్రీం కోర్టులో మిగిలిన జడ్జిలందరూ ఇలాగే వరసబెట్టి తమను తాము ఈ కేసునుండీ తప్పింపచేసుకుంటే(recuse) అప్పుడు గౌతం న్యాయం కొరకు పాకిస్థాన్ సుప్రీంకోర్టు లో పిటిషన్ వేయాలా...???
6 ఏళ్ళలో ...ఏం గతి పట్టించార్రా..దేశాన్ని ?
గౌతం లాంటి ప్రముఖుడూ ...న్యాయం కొరకు సుప్రీంకోర్టు తలుపు తట్టగల వనరులున్న వ్యక్తికే
ఈ నిస్సహాయ పరిస్థితి వుంటే సామాన్యుల పరిస్థితేమిటో ..ఒకసారి ఊహించండి ?