82 గంటలుగా మేఘా పై కొనసాగుతున్న ఐటి దాడులు

 


82 గంటలుగా మేఘా పై కొనసాగుతున్న ఐటి దాడులు... రేపు రంగంలోకి ఈడీ ? ఇంటి పక్కనే మకాం వేసిన తెలంగాణా మంత్రులు...!ఇరు తెలుగు రాష్ట్రాలకి తెలిసిన ప్రముఖ కాంట్రాక్టర్‌ మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో గత నాలుగు రోజులుగా ఐటి సోదాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. భారీగా అక్రమాలు చేసారనే అనుమానాలు రావడంతోనే ఐటి అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఐటి సోదాలు పూర్తిగా ఢిల్లీ నుంచి వచ్చిన ఐటి బృందాల ఆధీనంలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఢిల్లీ అధికారులు హైదరాబాద్‌ చేరుకున్న తరువాతే సోదాల విషయమై హైదరాబాద్ లో ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దగ్గరి సంబంధాలు ఉండటంతోనే, ఐటి అధికారులు వచ్చే దాకా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు ఐటి వర్గాలు చెబుతున్నాయి. మేఘా కంపెనీ చేపట్టిన కాంట్రాక్టులు, రెండు ప్రభుత్వాల నుంచి వచ్చిన కాంట్రాక్టుల్లో ఉన్న బిల్లుల వివరాలు తెలుసుకుని మరీ ఐటి రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.


Popular posts