ఆర్టీసీ సమ్మెపై తేల్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది సీఎం కేసిఆర్

ఆర్టీసీ సమ్మెపై తేల్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం సీఎం కేసిఆర్ నేరుగా రంగంలోకి దిగనున్నారు. సమ్మె పరిణామాలు, కార్మికుల డిమాండ్లపై సీఎం ఆధ్యర్యంలో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు, ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. దసరా సీజన్ కావడంతో ఓ వైపు ప్రజల నుండి ఒత్తిడి పెరుగుతుండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు వారితో చర్చలకు దిగింది. ఇక కార్మికులు సైతం సమ్మెను ఉధృతం చేసేందుకు ఇతర సంఘాల మద్దతు కోరుతున్నారు. ఇందుకోసం ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు.