మంత్రిని కలిసిన గోశాల సంరక్షకులు

అమలాపురం గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు, సభ్యులు జున్నూరి వెంకటేశ్వరరావు, సలాది వెంకట సాయిరాం, గోవ్వాల అచ్యుత రామయ్య తదితరులు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామాత్యులు శ్రీ పినిపే విశ్వరూప్ ని ఈరోజు ఆయన స్వగృహంలో కలిశారు. గోశాలలో ప్రస్తుతం ఉన్న 160 గో - సంతతికి గోశాల నిర్వాహణకు సుమారు ఐదు లక్షల రూపాయలు వ్యయం అవుతుందని, ఎడతెరపి లేని వర్షాల కారణంగా ఎండుగడ్డి తీవ్రకొరతను ఎదుర్కొంటున్నట్లు నిర్వహణ అత్యంత భారమౌతుందని వివరించారు. సైలెజ్, అమృతదాణా వంటి ప్రభుత్వ పథకాలు గోశాలకు వర్తింపజేయాలని వారు కోరారు. రోజుకు రెండు ట్రాక్టర్ల గడ్డి అవసరమౌతుందని రైతులు, దాతలు సహకరించాలని వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.