ఆర్‌టీ‌సీ చెంగిచెర్ల డిపో డ్రైవర్ గుండెపోటుతో మృతి

ఆర్‌టీ‌సీ చెంగిచెర్ల డిపోలో పని చేస్తున్న డి. కొమురయ్య అనే డ్రైవర్ గుండెపోటుతో చనిపోయారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో చెంగిచెర్ల డిపో నుంచి ఉప్పల్ డిపో వరకూ ర్యాలీ జరుపుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. కిందపడిపోయిన కొమురయ్యను ఆదిత్య ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో తోటి ఆర్టీసీ సిబ్బంది, కొమురయ్య కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 


Popular posts