హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని టీటీడీపీ అధికారికంగా వెల్లడి

హైదరాబాద్: హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని టీటీడీపీ అధికారికంగా వెల్లడించింది. టీడీపీ సీనియర్ అయిన కిరణ్మయిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆమెకు బీఫామ్ అందచేశారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని టీటీడీపీ నిర్ణయించుకుంది. కొన్ని రోజులుగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హుజూర్ నగర్ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. టీటీడీపీలోని సీనియర్ నేతలు, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని చివరకు కిరణ్మయిని తమ అభ్యర్థిగా ప్రకటించారు.