సింగరాయకొండ మూలగుంటపాడు పంచాయతీ పరిధిలో ఉన్న మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన.
ప్రకాశం జిల్లా తెలుగు యువత నాయకులు షేక్ అబ్దుల్ అజీం మరియు కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సన్నెబోయిన శ్రీనివాసులు గారి చేతులమీదుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సన్నెబోయిన శ్రీనివాసులు గారు మరియు ప్రకాశం జిల్లా తెలుగు యువత నాయకులు షేక్ అబ్దుల్ అజీం మాట్లాడుతూ
అహింసనే ఆయుధంగా చేసుకుని అంతటి స్వతంత్ర ఉద్యమాన్ని నడపటంలోనే ఆ మహానుభావుని నాయకత్వ లక్షణం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది.. నేడు మనం పీలుస్తున్న స్వేచ్చ వాయువులు అలాంటి ఉద్యమాల ఫలితమే.. ప్రతీ భారతీయుడు తన కోసంతో పాటు దేశం కోసం కూడా జీవించాలని ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవల్సిన పాఠం.. జాతి పిత గాంధీ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సన్నెబోయిన శ్రీనివాసులు మరియు ప్రకాశం జిల్లా తెలుగు యువత నాయకులు షేక్ అబ్దుల్ అజీం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.
సింగరాయకొండ ఉన్న మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన.