అక్టోబర్ 5 సాయంత్రం 6 గంటల లోపు 160 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి

అక్టోబర్ 5 సాయంత్రం 6 గంటల లోపు 160 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరినట్లు యాజమాన్యం ప్రకటించింది. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు, సూపర్‌వైజర్లు, ఆఫీస్ స్టాఫ్, మెకానిక్‌లు ఉన్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం విధుల్లో చేరాలంటూ అల్టిమేటం జారీ చేసినప్పటికీ సమ్మెను విరమించేందుకు ఆర్టీసీ సంఘాలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. తమ డిమాండ్ల నెరవేర్చే వరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాయి.