కేంద్రానికి దొరికిన  తిమింగలం

కేంద్రానికి దొరికిన  తిమింగలం _రహస్య జీఓల విలువ_రూ. 6 లక్షల కోట్లు


*_ఒకొక్క విషయం బయటపడుతోంది. కలవరపెడుతోంది. కళ్ళుమూస్తే దారుణాలు ఎక్కడ బయటకు పొక్కుతాయోనని అధినేతలకు భయాలు.. ఆరేళ్ళు గుట్టుగా చేశారు. చేయించారు. దోచేశారు.. పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం గుంభనంగా వీటిని దాచేసింది. అంతా 'కరెక్ట్' అయితే రహస్యం ఎందుకు..? ఎందుకో..? ఎవరి కోసం..? ఎక్కడో 'తేడా' కొడుతోంది. సరిగ్గా సరైన సమయానికి భాజాపాకు బలమైన అస్త్రం దొరికింది. ప్రజాప్రతినిధులకు రెగ్యులరైజ్ చేసిన భూ విషయాలకు సంబంధించినవి... కలెక్టర్ కార్యాలయాల నిర్మాణాలకు సబంధించిన, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన జీఓలు... ఇలా ఒక్కటేమిటి... ఏకంగా 43,462 జీఓలు...'గులాబీ దళపతులు' తమకు తోచిన రీతిలో తమ వాళ్ళకోసం తెగబడ్డారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన తరు ణం రానే వచ్చింది. ఇదే అదునుగా కొందరు హైకోర్టు గుమ్మం తట్టారు. ఇక గుట్టుగా ఉంచాల్సింది ఏం లేదు. ఉండదు. శాఖల వారీగా విడుదలైన జీఓలు కూడా గల్లంతైన జాబితాలో ఉన్నాయి. ఇందులో లాభపడ్డ వారి గుండెల్లో కొంత గులుబు నెలకొంది. '


*ఆరేళ్ళు... అత్యంత రహస్యం:*


'గత ఆరు సంవత్సరాలుగా గుట్టుగా వ్యవహారం సాగింది' అనే కంటే "సాగించారు.... సాగిస్తున్నారు... ఇంకా వీలైతే సగర్వంగా సాగించేవారు" అంటే చాలా బాగుంటుంది. జూన్ 2వతేదీ, 2014 నుండి ఆగష్టు 15వ తేదీ, 2019 మధ్యన ఈ తతంగం అత్యంత రహస్యంగా నడిచింది. సుమారు 1.04 లక్షల జీఓలు జారీ అయ్యాయి. ఇందులో 43,462 జీఓలు కన్పించకుండా పోయాయి.


*శాఖల వారీగా..📷:*


జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (జిఏడి)లో 17,061 జీఓలు జారీ అయ్యాయి. అందులో 9,053 జీఓలు కన్పించకుండా పోయాయి. హోం శాఖలో 7,945 లో జీఓలు జారీ అయ్యాయి. అందులో 5,371 జీఓలు అదృశ్యమయ్యాయి. ఆర్ధిక శాఖలో 11,995 జీఓలు ప్రభుత్వం జారీ చేసింది. అందులో 5,150 జీఓలు ప్రభుత్వ అంతర్జాలంలో లేవు. పంచాయితీరాజ్ శాఖలో 4,071 జీఓలు జారీ అయ్యాయి. అందులో 2,249 జీఓలు పత్తా లేకుండా పోయాయి.


*ఈ లెక్కలు మాత్రం పక్కా..📷:*


సెల్ ఫోన్ బిల్లుల చెల్లింపులు, వాటర్ క్యాన్ల కోసం ఖర్చు చేసిన డబ్బుల విషయానికి సంబంధించిన జీఓలను పక్కగా ప్రభుత్వ అంతర్జాలంలో క్రమం తప్పకుండా అప్ అప్ లోడ్ చేయడం గమనార్హం. ఉదాహరణకు 2014 జూలై 9వ తేదీన జీఓ నెంబర్ 15 విడుదల చేశారు. అందులో రూ.128లు ఫోన్ బిల్లు చెల్లించేందుకు నిధుల విడుదల చేసిన జీవో ఉంది. ఇదే తరహలో 743 జీఓ ద్వారా రూ.359లను బిఎస్ఎన్ఎల్ బిల్లు పక్కాగా చెల్లించినట్టు ఉంది.


*విలువ.. రూ.6లక్షల కోట్లు...📷:*


గత ఆరేళ్ళలో తెలంగాణ ప్రభుత్వం 1,04,171 జీవోలు విడుదల చేస్తే.. 6లక్షల కోట్ల విలువైన 43,462 జీఓలు దాచి పెట్టింది. ఇందులో ప్రభుత్వం చాలా తెలివిగా....ప్రధానంగా తక్కువ నిధుల జీఓలను ప్రజల ముందుంచింది. అధిక నిధులు జీఓలను దాచారు. పారదర్శక పాలనే లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం జీఓలను ఎందుకు దాస్తున్నారు.


కలెక్టర్ కార్యాలయాల నిర్మాణానికి విడుదల చేసిన జీఓలు, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన జీఓలు సైతం అదృశ్యమైన వాటిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా, వైరాలో ఓప్రాజెక్ట్‌కు సంబంధించిన జీఓ ఇంతవరకు అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 95శాతం జీఓలు ప్రజలకు అందుబాటులో ఉండేవి. 35శాతం జీవోలను ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.


*తెలంగాణ సర్కార్ కు హైకోర్టు నోటీసులు:*


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 43,462 జీవోలు అదృశ్యం కావడంపై హైకోర్టు బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు చీప్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం నాలుగు వారాల్లో ప్రభుత్వం స్పందించాలని నోటీసులు ఇచ్చింది. హైద్రాబాద్ ఎల్బీనగర్ కు చెందిన పేరాల శేఖర్ రావు జీఓలు మాయం కావడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.