నీతి కి, నిజాయితీకి మారుపే రైన విజయసాయి రెడ్డి
విజయ సాయి రెడ్డి, రాజ్యసభ ఎంపీ

 

నీతి కి, నిజాయితీకి మారుపే రైన విజయసాయి రెడ్డి గారికి విధేయతతో నమస్కరించి రాయునది ఏమనగా, ప్రియమైన రెడ్డి గారు కాలం మారింది సర్ ఎంతలా అంటే అత్యంత ఘోరంగా వేల కోట్ల అక్రమ ఆస్తుల కేసుల్లో A2 గా ఉన్న వ్యక్తి ఈడి,ఫెమా,సీబీఐ లాంటి సంస్థల చేత ఒక జర్నలిస్ట్ మీద దర్యాప్తు చేయండని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు  ఫిర్యాదు చేసే అంతగా పరిస్థితి దిగజారిపోయింది సర్. అందరూ మీలా నిజాయితీగా ఉంటారా చెప్పండి.

 

ఒక సామాన్యుడిగా అడుగుతున్నా సర్, మీరేదో అక్రమాలను అరికట్టే పనిలో పడ్డారు కదా, ఒక చిన్న సహాయం చేయండి సర్ ప్లీజ్, మా తెలంగాణలో జూపల్లి రామేశ్వర్ రావు అనే వ్యక్తి ఉన్నారు , ఆయనకు 220 కంపెనీలు ఉన్నట్టు తెలిసింది . పదేళ్ల క్రితం ఏమిలేని అయ్యవారికి 220 కంపెనీలు, వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో మా ప్రజలకు అర్థం కావట్లేదు సర్. ఇక్కడ అడిగే దమ్ము , ధైర్యం ఎవరికీ లేదు రెడ్డి గారు దయచేసి మీరే అడగాలి. ఇలాగే సుప్రీం కోర్టు జడ్జి కి లేఖ రాయాలి. మీరు అవినీతిని సహించరని మీకు అడుగుతున్నా సర్ ప్లీజ్.

మొన్నటికి మొన్న మై హోమ్ మీద gst రైడ్స్ జరిగితే అసలు ఎంత బయటపడింది  ఎవరు చెప్పట్లేదు రెడ్డి గారు, దమ్మున్న మీరే మాకు చెప్పాలి. వేల ఎకరాల భూములను కబ్జా చేశారట సారు దయచేసి ఆ దళిత బిడ్డలను మీరు ఆదుకోండి పుణ్యం ఉంటది.ఇదంతా మీడియాలో రాదు సర్, మీ ' సాక్షి ' గా విచారణ చేయండి .బాంచన్ నీ కాల్మొక్త పటేలా...

 

ఆర్టీసీ ని మేఘా కృష్ణారెడ్డి మింగేస్తున్నడని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు సారు. మొత్తం 3500 కోట్లు మేఘా కు రావడం కోసం 50 వేల కుటుంబాలను రోడ్డు మీద పడేస్తున్నారు రెడ్డి గారు. కాళేశ్వరం లో 34 వేల కోట్లు తినేసారట. నాకు తెలుసు విజయ సాయి రెడ్డి గారు మీరు ఈ అవినీతిని చూసి తట్టుకోలేరు. మీ ' సాక్షి ' గా నిగ్గు తేలాలి సర్.అవును సర్ నాకు ఒక్కటి అర్థం కావట్లేదు...రవి ప్రకాష్  అరెస్ట్, ఆరోపణలు, ఆర్టీసీ 50 వేల కుటుంబాల అక్రందనను డైవర్ట్ చేయడం అంటున్నారు నాకు తెలియట్లేదు సర్, దయచేసి చెప్పండి. మీ  మన ' సాక్షి ' అబద్దం చెప్పదు సర్, అన్ని నిజాలే చెప్తుంది.

 

అప్పట్ల చంద్రబాబు నాయుడు మీద  అదేదో పుస్తకం మీ ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు కదా..అందులో మేఘా కృష్ణా రెడ్డి ని దుర్మార్గుడు, అవినీతి పరుడు అని రాశారు సర్.. అది మీరు రాసిందే కదా...అందుకే మిమ్మల్నే అడుగుతున్న సర్ మీరు మాట తప్పర్..మడమ తిప్పరు...మీరు దీని మీద విచారణ అడగాలి సర్ మీరు అడుగుతారు సర్ . మీరు లెక్కల్లో చాలా ఫాస్ట్ సర్..అందరి లెక్కలు తేలుస్తారు. ఏమైనా సత్య హరిశ్చంద్రుడు తరువాత మీరే సర్ అందుకే మిమ్మల్నే అడుగుతున్నా...

 

Popular posts
సీమాంధ్రుల కలల రాజధాని కోసం ఉద్యమిస్తాం*
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో