రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు


రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ మానవాళికి ఓ సందేశమని తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షించారు. మనిషిని మంచి మార్గంలో నడిపించడానికి విజయదశమి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ ఆనందంతో పండుగ జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.