బ్యాంకులు విలీనం చెయ్యొద్దంటూ రాజవొమ్మంగి లో ధర్నా
సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం
రాజవొమ్మంగి, అక్టోబర్ 22 : కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేయడం ప్రజా వ్యతిరేకమని సి ఐ టి యు జిల్లా నాయకులు పి రామ రాజు అన్నారు. ఆంధ్ర బ్యాంకు ను యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం తగదని ఉద్యోగులు మంగళవారం నాడు సమ్మె చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా స్థానిక ఆంధ్ర బ్యాంకు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు, మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్ర బ్యాంక్ ను విలీనం చేయడం వల్ల వినియోగదారులు నానా ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల విలీనం అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు సతీష్, శ్రీను, భవన నిర్మాణ కార్మికులు నాగు, అచ్చా రావు, రామకృష్ణ, కృష్ణ, రాంబాబు, కిరణ్, జెమిని, లక్ష్మణ్, సూరి, త్రిమూర్తులు, మహిళలు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.