హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కాచిగూడ, అంబర్‌పేట్‌, చిక్కడపల్లి, ముషీరాబాద్‌, నాగోల్‌, బండ్లగూడ, కోఠి, గోషామహల్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, ఉప్పల్‌, చింతల్‌కుంట, సైదాబాద్‌, చంపాపేట్‌, సరూర్‌నగర్‌, బేగంపేట్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, దుండిగల్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, కుషాయిగూడ , జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సుందరయ్య పార్కు రోడ్డులో మోకాల్లోతులో వర్షపు నీరు నిలిచింది.