ఎంతకు తెగపడ్డార్రా..! ‘కబ్జా’ కథనానికి కట్టుబడి ఉన్నాం*

*ఎంతకు తెగపడ్డార్రా..! 'కబ్జా' కథనానికి కట్టుబడి ఉన్నాం*

◆ తప్పుడు కేసుపై వీడియో సాక్ష్యాలు లభ్యం
◆ ఆధారాలు ఇస్తున్నాం_
◆ తప్పుడు డాక్యుమెంట్ల 'సృష్టి'oచిన 


*_అనంచిన్ని వెంకటేశ్వరరావు తెలుగు జర్నలిజంలో పరిచయం అవసరం లేని పేరు. 'ఆయన మీద ఈ తప్పుడు కేసులను వివరిస్తున్నాం' అని చెప్పాం. ఆయనపై కేసు పెట్టిన ప్రతి తప్పుడు నాయళ్ళను, అవే తప్పుడు ప్రచారం చేసే ఎందకూ పనికిరావని సన్నాసులను కూడా 'ఊక దంపుడు' దంచాలనే ఈ స్పెషల్ స్టోరీ. ఆయన రాసిన పరిశోధన ఇది.._*


*1983 సమాధిని తవ్వితే..:*
*_నాటి ఆర్డీఓ జనార్దన్ రెడ్డి అక్టోబర్  5,1983న అవార్డ్ నెం. 6/83, ఫైల్ నెం. 829/81 ప్రకారం సర్వే నెంబర్ 207ను మూడు భాగాలుగా అనగా… (ఖాకీలకు అర్థం కావడం కోసం వివర్రంగా చెపుతున్నామ్.) 207/1 లో మూడు ఎకరాలు, 207/2లో 19 గుంటలు, 207/3లో 18 గుంటల భూమిగా.. అధికారికంగా లిఖితపూర్వకంగా సబ్ డివిజన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంటే… అక్టోబర్ 5, 1983న సర్వే నెంబరు 207 అధికారికంగా అంతర్థానమైయింది. (గడ్డి తినే వారు అర్థం కానట్లు నటిస్తారు). సదరు ఆర్డీఓ సర్వే నెం. 207/1 లో 3 ఎకరాలు, 207/3లో  18 గుంటల భూమిని పట్టాదారుల నుంచి రూ. 84,664  లు ఇచ్చి భూసేకరణ చేశారు. ఇలా చేసిన భూమి స్థానిక ఎన్జీఓల ఇళ్ళ స్థలాలకు నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటైన 'ఎన్జీఓల సంక్షేమ సంఘానికి కేటాయించారు. అంటే 207/2లో ఉన్న భూమి నాటి నుంచి నేటి వరకు పట్టాదారుల పేరుతోనే అధికారికంగా ఉంది._*


*1991లో 'హరి హరా' కుమ్ముడు ప్రారంభం:*
1991 నుంచి 1993 వరకు ఈ సంక్షేమ సంఘానికి *మేకల హరిహర నాథుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. (ప్రస్తుతం మరో జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ అధికారిగా పనిచేస్తున్నాడు). ఈ సమయంలోనే ఈ 'దొంగాట'కు తెరలేచింది. అనధికారికంగా అక్రమ రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. ఇక్కడే దొర్లిన తప్పుకు నేడు ఈ కబ్జా కోరులకు వరంగా మారింది. ప్రభుత్వం అప్పగించిన సర్వే నెంబరు 207/1, 207/3 కాకుండా… తమకు హక్కు 'లేని' సర్వే నెంబరు 207 ద్వారా ఓ ప్లాట్ తన తండ్రి అయిన సత్యనారాయణకు* (డాక్యుమెంట్ నెం. 814/1993) అమ్మటం మరో హాస్యాస్పదమైన మలుపు. డాక్యుమెంటు నెం. 807/1993, మాణిక్య శర్మ, డాక్యుమెంటు నెం. 808/1993 బి.లక్ష్మీ, డాక్యుమెంటు నెం. 813/1993, కె.సత్యనారాయణ, డాక్యుమెంటు నెం. 809/1993 ఎం.శ్రీధర్ రెడ్డి తదితరులకు హక్కు లేని భూమిని సగర్వంగా అమ్మారు. ప్రధాన కార్యదర్శి మేకల హరి హరనాథ్ తండ్రి మేకల సత్యనారాయణ ద్వారా 2015లో విద్యాప్రకాశ్ రెడ్డి (డాక్యుమెంటు నెంబరు: 7920/2015)కి, వి.సౌజన్య (డాక్యుమెంటు నెం.7921/2015), టి.వరలక్ష్మి (డాక్యుమెంటు నెం.7922/2015), పి.సునీత రెడ్డి (డాక్యుమెంటు నెం.7962/2015), విద్యాప్రకాశ్ రెడ్డి (డాక్యుమెంటు నెం. 7990/2015), వి.సౌజన్య (డాక్యుమెంటు నెం. 7991/2015), పి.సునీత రెడ్డి ( డాక్యుమెంట్ నెం.7992/2015), జి.సుశీల (డాక్యుమెంట్ నెం.7919/2015)ల ద్వారా అమ్మారు. వీళ్ళెవరూ ప్రభుత్వ ఉద్యోగులు కాక పోవడం ఒక విశేషం కాగా… పోలీసు ఫిర్యాదులో రజిత తన భర్త హరిబాబు మిత్రులుగా పేర్కొంటున్న మనోహర్ రెడ్డి ఈ భూ కుంభకోణంలో అనధికారి పాత్రధారి ఎలా అంటే హక్కులేని భూమి కొనుగోలు చేసిన విద్యాప్రకాశ్ రెడ్డి అల్లుడు కాగా., సునీత రెడ్డి స్వయాన ఇతగాడి కూతురు.


*లోను పెట్టి… నమ్మకం కలిగించి..:*
ఈ కుంభకోణంలో హరిహరనాథ్, మనోహర్ రెడ్డి అల్లుడు హెచ్.విద్యా ప్రకాష్ రెడ్డి, సౌజన్యతో పాటు సిండికేట్ బ్యాంకు మేనేజర్ పై రూ.25లక్షలు మోసం కేసు నమోదైంది. ఈ పత్రాలు సరిగ్గా లేనంద వల్ల ఈ కేసు ఫైలైంది. ఈకేసులో మూడు లక్షలు చేతులు మారినట్లు తెలిసింది.


*కమీషనర్ కళ్ళు తెరిచే అనుమతులు:*
నవంబర్ 14, 2017 నుంచి బాధితులు మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులకు ఈ ప్లాట్ల బాగోతంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందాయి. అయినా అధికారులు అనుమతులు ఇచ్చేశారు.


 *మూర్ఖుల్లారా... వినండి:*
ఎమ్మర్వో లిఖితపూర్వకంగా మే10, 2019న ఫైల్.నెం.సి/1896/2019న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. '1991 నుంచి 1993 వరకు సోసైటికీ సంబంధించిన వ్యక్తులు అమ్మిన పది ప్లాట్లు అనైతికమని చెప్పారు. అంటే పక్క వాడి సొమ్మును కాజేశారని స్పష్టం. అయ్యా కమీషనర్… ఫిర్యాదులు అందిన సంవత్సరం తరువాత ఈ దొంగ ప్లాట్లకు అనుమతులు ఇచ్చారని స్పష్టంగా తేలిపోతుంది. అయితే మున్సిపల్ కమిషనర్ తన అనుమతి మంజూరు పత్రంలో.. 'రజిత దరఖాస్తును అన్నీ పరిశీలించి నియమ నిబంధనల ప్రకారం అనుమతి' ఇస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా… లెటర్ నెం. జి1/ఇ-299154/ఎంబీఎన్ఆర్/2019, తేది. 4-6-2019లో ఇదే కమీషనర్ 'నాకేం సంబంధం లేదు. ఉన్నతాధికారుల సూచనల మేరకే ఈ అనుమతులు ఇచ్చానని చెప్పారు. ఔరా.. తల్లీ ఫిర్యాదులు ఇచ్చిన ఏడాది తరువాత అసలు సర్వే నెంబర్ లేని 207లో ఎలా అనుమతి ఇచ్చారో… అవినీతి నిరోధకశాఖకు బాధితులు వెళితే అందరి అసలు బతుకు బయటకు వస్తుంది. తథాస్తు. శ్రీఘ్రమేవ అభిష్ఠి ప్రాప్తి రస్తు.



*తప్పుడు ఫిర్యాదు:*
*_అనంచిన్ని వెంకటేశ్వరరావు 1996లో న్యూఢిల్లీ నుంచి 113.16 కోట్ల 'యూరియా స్కాం' కథనాలను అందించారు. అయితే అప్పుడు లేని ముసుగు దొంగలు 2013 నుంచి బహాటంగా బయటకు వచ్చారు. (ఈ తొలి కేసు తప్పాక ముందు కథనాలలో మాట్లాడుకుందాం.) ఎన్నో ఆటుపోట్ల, కేసులు సంకెళ్ళు, దౌర్జన్యాలు, బెదిరింపులు, దొడులను ఎదుర్కొన్నారు. ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎదుర్కోబోతున్నారు. అన్నీ తెలిసి అన్యాయాలను ఎదుర్కొంటున్న పాత్రికేయ గుండె ఆయనదే._*


*_తప్పుడు కేసులో ఏం చేశారు. వాస్తవంగా ఏం జరిగింది... అనే కోణంలో ఆధారాలను సైతం ఇస్తున్నాం._*


*_ఫిర్యాదులో 27వ తారీఖున ఆయన ఓ సంఘటన స్థలంలో ఉన్నట్లు రాశారు._*


*ఉదయ అక్షరం పంచ్:*
*_అది తప్పు. ఆయన ఆ సమయంలో హైదరాబాద్ నగరంలో ఉన్నారు. గత ఏడాదిగా ఆయన తప్పుడు ఫిర్యాదు జరిగిన జిల్లాకు వెళ్ళలేదు. హైదరాబాద్ లో ఉన్నట్లు సిసీ పుటేజులు మా వద్ద భద్రంగా ఉన్నాయి. సామాన్యులు ఎన్నిసార్లు తిరిగితే కాని ఎఫ్ఐఆర్ లు… ఈ కబ్జా కోరులు (ఎమ్మార్వో నివేదిక ప్రకారం) రాగానే పోలీసులు హడావుడి చేయడం._*


*(?)* ఒకవేళ 'అనంచిన్ని' సంఘటన స్థలానికి వెళితే..?


*ఉదయ అక్షరం పంచ్:*
హైదరాబాద్ నుంచి మధ్యలో ఇన్న టోల్ గేటు వద్ద సిసి పుటేజీలో ఉంటారు.


*(?)* 27న సంఘటన జరిగితే..?
*ఉదయ అక్షరం పంచ్:*
మరి 29వ తారీఖు వరకు ఎందుకు ఫిర్యాదు ఇవ్వ లేదు? (స్కెచ్ వేసుకోవాలిగా..?)


*(?)* 27న ఫిర్యాదుదారు, అక్కడే ఉన్నారని చెప్పే వారి సెల్ టవర్ల సిగ్నల్స్ ఎక్కడ.?


*ఉదయ అక్షరం పంచ్:* 
 'అనంచిన్ని' ఆ సమయంలో హైదరాబాద్ లో ఉన్నట్లు సిసి పుటేజి. సెల్ సిగ్నల్స్ కూడా హైదరాబాద్ లోనే… మరో ఫిర్యాదుదారు సెల్ సిగ్నల్స్ నాగర్ కర్నూల్ లో ఉన్నట్లు లభ్యం.


*(?)* మనోహర్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి లు ఉన్నట్లు చెప్పడం


*ఉదయ అక్షరం పంచ్:*
ఈ ఇద్దరూ.. ఈ ప్లాట్ల కొనుగోలు భాగస్వాములు కావడం.


*ఉదయ అక్షరం ప్రశ్నలు:*


ఎవరి వత్తిడితో ఎంత డబ్బు తీసుకొని ఈ ఫిర్యాదును స్వీకరించారు.?


 ఉన్నతస్థాయి దర్యాప్తుకు సిద్దమా..? 


ఆధారలు లేని ఫిర్యాదుకు ఇచ్చే గుర్తింపు… 


100%. ఆధారాలను 'ఉదయ అక్షరం' బట్టబయలు చేసింది. మరి ఈ కబ్జాదారులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.? 'అనంచిన్ని'ని ఎలా ఉంటారో వీరు గుర్తించగలరా..?_*



*ఒరేయ్... నల్లోడా... పరిశోధన అంటే... 'లేనిదాన్ని ఉన్నట్టు చూపించే' కథ కాదు. ఖమ్మం అర్భన్ కథ కాదు. నువ్వు 'క్రైం రిపోర్టర్' అనో నీలుక్కుంటున్నావు.. కదరా..? అదే ఖమ్మంలో 'అనంచిన్ని'పై పెట్టిన కేసులో భాగోతాలు నీకు రాసే దమ్ము ఎలాగో లేదు. మీం రాసి... చూపిస్తాం..* *నేర్చుకోరా...?* *త్వరలోనే బతుకు 'బొమ్మ' ఏంటో చూపుతాం.*