చెట్టు నుండి జారిపడి గిరిజనుడు మృతి

 


చెట్టు నుండి జారిపడి గిరిజనుడు మృతి


ప్రమాదవశాత్తు చెట్టు నుండి జారిపడి గిరిజనుడు మృతి చెందిన సంఘటన రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మారేడుబాక పంచాయతీ
ఉర్లాకులపాడు చెందిన కోసూరి సోమరాజు(52) అనే గిరిజనుడు ఈ నెల 14వ తేదీన యధావిధిగా మేతకు ఆవులను తోలుకొని వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు గ్రామస్తులు 15వ తేదీన అడవులో గాలించగా కొండాలమ్మ తల్లి అటవీ ప్రాంతంలో తేనె పట్టు తీసేందుకు చెట్టు మీదకు ఎక్కి రాయి మీదకు జారిపడి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సోమరాజు కుమారుడు రాంబాబు జడ్డంగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై మోహన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై 16వ తేదీన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.