కోటి పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
కోటి పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

 

 ఖరగ్‌పూర్‌ ఐఐటీ సాయంతో హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ భారీ కసరత్తు  ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అన్నిరకాల పుస్తకాలు

 కేవలం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు.. ఓ గ్రంథాలయం ఉన్నట్టే దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఉద్యోగ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులైనా.. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులైనా.. ఫలానా పుస్తకం దొరకడం లేదన్న బెంగ అక్కర్లేదు. కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉంటే..  దానిని వేరొకరికి ఇచ్చేశారు... ఇక తానెలా చదువుకునేది? అన్న ఆందోళన 

కాలేజీ విద్యార్థులకు అవసరం లేదు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన రిఫరెన్సు పుస్తకాలను  ఎలా కొనాలనే ఆలోచనా వద్దు. ఇప్పుడివన్నీ ఒకేచోటే అందుబాటులోకి వచ్చాయి!  ఇవే కాదు..  ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు  అవసరమైన రిఫరెన్సు పుస్తకాల దాకా 

అన్నీ అందుబాటులో ఉన్నాయి.  ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు.  వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వాటికి సంబంధించిన వీడియోలు చూడవచ్చు. ఆడియోలను వినవచ్చు. పీడీఎఫ్‌ కాపీలను కూడా పొందొచ్చు. 

ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్‌ సదుపాయం. అదొక్కటి ఉంటే ఏ పుస్తకం అయినా చదువుకోవచ్చు. ఒకటి కాదు.. రెండు కాదు.. కోటికిపైగా పుస్తకాలను, ఆర్టికల్స్, రచనలను, విమర్శనా వ్యాసాలు..  నెట్‌ ఉంటేచాలు నట్టింట్లో ఉన్నట్లే. 

ఐఐటీ ఖరగ్‌పూర్‌ సాయంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ భారీ కసరత్తును చేసింది.