సైరా రేవంత్ రెడ్డి పై పెట్టిన చిత్రాలు సోషల్ మీడియాలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి

 


సైరా రేవంత్ రెడ్డి పై పెట్టిన చిత్రాలు సోషల్ మీడియాలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 
ప్రగతిభవన్ ముట్టడి తర్వాత రేవంత్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది 
ఎంతటి పగడ్బందీ పథకాలతో పోలీసులు వ్యవహరించినా వాళ్ళ కళ్ళు గప్పి రేవంత్ ప్రగతి భవన్ కు చేరుకోవడం, అరెస్టు కావడం విపరితమైన సంచలనం సృష్టించింది. అన్ని రాజకీయ పక్షాల కు చెందిన అన్ని వర్గాలు రేవంత్ సాహసోపేత సంచాలనానికి అచ్చెరు వొందుతున్నారు. సోషల్ మీడియాలలో మాత్రం రేవంత్ ను నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఏకంగా ఆయన్ని సైరా....అంటూ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి తో పోల్చి చిరంజీవి చిత్రం సైరా పోస్టర్ కి రేవంత్ ముఖాన్ని జోడించి సైరా రేవంత్ రెడ్డి అంటూ పెడుతున్న చిత్రాలు విపరీతంగా వైరల్ అవుతోంది.