అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం పట్టివేత

వందల క్వింటాళ్లు రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో  విజిలెన్స్, సివిల్‌సప్లయ్, పోలీస్‌ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రమౌలి, సివిల్‌ సప్లయి తహసీల్దార్లు నందిని, పద్మ, రూరల్‌ సీఐ జలేంధర్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. తాండూరు మండలం చెంగోల్‌ గ్రామానికి చెందిన వడ్డె వెంకటేశం గత కొంతకాలంగా రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని గౌతంపూర్‌ శివారులో ఉన్న రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ వెనకాల ఓ గదిలో 150 క్వింటాళ్ల (15టన్నుల) రేషన్‌ బియ్యంను అక్రమంగా నిల్వ ఉంచారు. పక్కా సమాచారంతో విజిలెన్స్, సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఆ ఇంటిపై  దాడులు చేశారు.