మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి నిన్న ఆత్మాహుతికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే వరంగల్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని డ్రైవర్ రవి నిప్పంటించుకోబోయాడు. దీంతో, రవి పక్కనే ఉన్న తోటి కార్మికులు అతన్ని అడ్డుకున్నారు.