తెలంగాణలో ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇటీవల ఇంటర్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపరిచాయి. పరీక్ష పత్రాల మూల్యాంకనం, ఫలితాల్లో పొరపాట్లు జరగడంతో 22మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థుల బలవన్మరణాలకు, ఇంటర్ ఫలితాలకు సం బంధం లేదని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, మృతి చెందిన విద్యార్థులకు సంబంధించి కొందరి పేపర్ల రీవెరిఫికేషన్‌లో మార్కుల వ్యత్యాసం ఉండటాన్ని గమనించాం. కాగా ఆర్టీసీ సమ్మె.. దానిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిని నిరసిస్తూ శనివారం డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఒంటికి నిప్పంటించుకున్నాడు. హైదరాబాద్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ విషాదం నుంచి తేరుకునేలోపే హైదరాబాద్‌లో మరో కార్మికుడు, రాణిగంజ్-2 డిపో కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణలో ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి