ధర్మాడి సత్యంకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

ధర్మాడి సత్యంకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బోటు ప్రమాదన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా, వివిధ రంగాల్లో ప్రజా సేవలు అందించిన ప్రతిభావంతులకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ఇవాల్వని సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని మంత్రిమండలి బుధవారం నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.