జగనన్నా...ఇదేం న్యాయం అన్నా?
నాన్నను రిలయన్స్ వాళ్లే చంపేశారని నువ్వంటే.. వారి బంకులు తగలబెట్టాం
చంద్రబాబు హయాంలో పెద్దాయన ప్రతీవర్ధంతికి మా నాన్న హత్యపై దర్యాప్తు చేయాలనేటోడివి.
ఇప్పుడేమైందన్నా? అస్సలు ఆ ఊసే లేదు.
.....................................................................................................
మానుకోటలో నీపై రాళ్లేయించిన ముక్కోడిని నానా బూతులు తిట్టాం
ఆంధ్రోళ్లది పేడబిర్యానీ అంటే.. ఆడి గబ్బు నోరు మూయించాం
ఆంధ్రా బేపనోళ్లకి మంత్రాలు సదవీనికి సరిగా రాదన్న కచరాని మంత్రాలతోనే తిప్పికొట్టాం.
అటు సోనియానీ, ఇటు కేసీఆర్నీ ఎదిరించిగల ఒకే ఒక పులివెందుల పులని జైకొట్టాం.
నువ్వేమో పిల్లిలా మారిపోయి ప్రగతిభవన్ లో మ్యావ్ మ్యావ్ అంటున్నావు..నీకేమైందన్నా?
............................................................................................................
సమైక్యాంధ్ర ప్రదేశ్ కి కట్టుబడి ఉంటానంటివి..చంద్రబాబువి రెండుకళ్ల సిద్ధాంతమని ప్రచారం జేస్తివి.
ఇప్పుడు ఉన్న మెల్లకన్నునూ పొడిచేసి...తెలంగాణ కంటితో చూస్తున్నావు.
నీకు ముఖ్యమంత్రి కంటివెలుగు పథకంలో చూపించుకోరాదే అన్నా.
..........................................................................................................
75 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలంటివి.. చట్టం జేస్తివి
వాచ్ మన్, తట్టలు మోసేవి, రిక్షాలు తొక్కేవి స్థానికులకు ఇచ్చి ..
నెలకు 4లక్షలకు పైగా వచ్చే సలహాదారు ఉద్యోగాలన్నీ తెలంగాణవాళ్లకిస్తివి.
రాష్ర్ట విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్మి.. సమైక్యాంధ్రగా ఉన్నప్పుడే ఏపీ గొంతు నొక్కాలని విశ్వప్రయత్నాలు చేసిన తెలంగాణ మేధావులైన జర్నలిస్టులు దేవులపల్లి అమర్, కొండుభట్ల రామచంద్రమూర్తి, అరవింద్ యాదవ్ లకు ఒక్కొకరికీ నెలకు 4 లక్షలకు పైగా చెల్లిస్తూ ఏపీని ఏం చేయాలనుకుంటున్నావన్నా?
వీళ్లంతా నువ్వు తెచ్చిన 75 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాల చట్టం వర్తించదా అన్నా?
..........................................................................................................................
వెల్లువెత్తిన వరదతో డ్యాంలు కొట్టుకుపోతాయేమోననే ఆందోళనలోనూ పోతిరెడ్డిపాడుకు నీరు తీసుకెళ్లకుండా ఫిర్యాదులు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి గోదావరి జలాలు రాయలసీమకు తెస్తానని నమ్మబలుకుతున్నావు..ఇది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడంలాంటిదే అన్నా.
..........................................................................................................................
రాజధాని పోతే పోయింది..పోలవరాన్ని ఎటువంటి ఇబ్బందుల్లేకుండా కట్టుకోవాలనే ఆలోచనతో 7 ముంపు మండలాలు ఏపీలో విలీనం చేయించిన గొప్ప ముందుచూపున్న చంద్రబాబు 70 శాతం పోలవరం పనులు పూర్తిచేస్తే..30 శాతం పనులు పూర్తి చేసి ఆంధ్రుల జీవనాడిని అందించాల్సింది పోయి కేసీఆర్ ఎత్తులకు చిత్తయి పోలవరం ఎత్తు తగ్గించే కుట్రలేవైతే ఉన్నాయో , అవి చాలా అన్యాయం జగనన్న.
..........................................................................................................................
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు గుడిలో బడిలో నామినేటెడ్ పదవులన్నింటిలోనూ 50 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన పదవులు ఇస్తామని చట్టం తెచ్చిన నువ్వే...ఒక్క రాష్ర్టస్థాయి నామినేటెడ్ పోస్టూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వకుండా మొత్తం మీ రెడ్లతో నింపేశావు..ఇదేనా అన్నా నువ్వు తెచ్చిన చట్టం చేసిన సామాజిక న్యాయం?
..........................................................................................................................
కొరతలు, కోతలకు చంద్రబాబుకు కారణమని ఆరోపిస్తున్న మీరు..చంద్రబాబు హయాంలో జరిగిన ప్రగతి పనుల ఫలాలకు వస్తున్న అవార్డులను మాత్రం ఎగేసుకుని వెళ్లీ మరీ అందుకుంటున్నారు. సిగ్గనిపించడంలేదన్నా?
..........................................................................................................................
ప్రమాణస్వీకారం చేశాక కుల,మత,ప్రాంతాలకు అతీతంగా పార్టీలను పట్టించుకోకుండా ప్రజలందరికీ సమాన అవకాశాలు, పథకాలు అందిస్తామని మాటిచ్చిన మీరు... రెడ్లకు తప్పించి ఎవరికైనా న్యాయం చేశారా అన్నా? మీ వైకాపా వారికే వలంటీర్లు, గ్రామ సచివాలయం పోస్టులు ఇప్పించుకున్నారని విజయసాయిరెడ్డి గారే ప్రకటించారు. వైకాపాలోనే మళ్లీ రెడ్లకే అత్యధికం వచ్చేలా చేసిన మీరు కుల, మత, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా పనిచేస్తానని చెప్పిన మాట తప్పుడే కదా అన్నా.
..........................................................................................................................
సన్నబియ్యం అని ..ఆ తరువాత నాలుక మడతేసి నాణ్యమైన బియ్యం ప్రకటించి చివరికి నానిన బియ్యం ఇచ్చిన మీరు రూపాయి బియ్యానికి 9 రూపాయిల సంచికి ఇవ్వడం మడమ తిప్పి..డబ్బు కోసం తప్పుడు పని చేశారా కాదా అన్నా?
..........................................................................................................................
అన్నం పెట్టే క్యాంటీన్లకు సున్నం వేయడమేనా రాజన్న రాజ్యము?
..........................................................................................................................
సాక్షిలో పనిచేసే ఉద్యోగుల మొత్తాన్ని ప్రభుత్వంలోకి రకరకాల పేర్లతో తీసుకుని నెలకు వంద కోట్లు వారికి జీతాలు రూపేణా, సౌకర్యాల పేరిట పందేరం చేస్తున్న జగనన్న..రైతన్న నీకేం అన్యాయం చేశాడన్నా? అప్పుల్లో మునిగిన అన్నదాత నోటికాడ రుణమాఫీని 7,582 కోట్లు లాక్కున్నావు. నీకున్న లక్షల కోట్లలో ఇదెంతన్నా? అన్నం పెట్టేవాడికి కన్నం పెట్టావు కదన్నా?
..........................................................................................................................
టీడీపీ హయాంలో అవినీతి అంటూ నరేగా బిల్లులు చెల్లించొద్దంటూ కేంద్రానికి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డితో ఫిర్యాదులు చేయించావు. అవినీతి ఏం లేదని కేంద్రం తేల్చింది. మీరు అధికారంలోకొచ్చాక మీ ఫిర్యాదులతో నిలిచిన నిధులు, ఏపీకి రావాల్సినవి రూ. 1969 కోట్లు విడుదల చేసింది. వీటితో పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నా..అలా చేయడంలేదు. రాష్ర్టవాటా జమ చేయాల్సి ఉన్నా చేయడంలేదు. ఉపాధిలో ఫస్ట్ ఉన్న రాష్ర్టాన్ని లాస్ట్ చేశావు కదన్నా?
........................................................................................................................
MGNREGA పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ 2014 నుంచి 2019 ఆరంభం వరకూ 26000 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్లు, 6 వేల అంగన్ వాడీ భవనాలు నిర్మాణం, 2200 గ్రామపంచాయతీ భవనాలు నిర్మాణం , 12,000 కిలోమీటర్ల రోడ్లు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 7,00,000 పంట కుంటలు తవ్విదేశంలోనే నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం నిలిచింది.
ఇప్పుడు మీరు అప్పుడు కట్టిన భవనాలన్నింటికీ వైకాపా రంగులేస్తున్నారు. అప్పుడు సాధించిన ప్రగతికి వచ్చిన అవార్డులు అందుకుంటున్నారు. శ్మశానాలకు సైతం బులుగు రంగు పులుముతున్నారు. కూలీలకు వేతనాలు పెండింగ్, ఉపాధి క్షేత్రస్థాయి ఉద్యోగులను నడిరోడ్డున పడ్డారు. ఇది న్యాయమా అని అడుగుతున్నాం జగనన్నా?
..........................................................................................................................
.........ఒక్క చాన్స్ ఇచ్చి వందేళ్లు వెనక్కి వెళ్లిన దగా పడిన సీమాంధ్రుడు..........