సైరా వర్సస్ నారా..!*

 


సైరా వర్సస్ నారా..!*


చిరంజీవి నటన అద్భుతం. 11 రూపాయల కోసం పాలేగాడు అని, మొదటి స్వాతంత్ర్య పోరాట యోధుడని ఎటూ తెగని చూడని ఆధారాలు లేని అభూత కల్పనల సినిమా. ఊహలకు తగ్గ కథ నటన గట్రాలతో ప్రేక్షకుడికి రొమాంచితం సైరా అని అంటున్నారు. కానీ ఓ యదార్థ గాథ…


నారా అనే నాయకుడి కోసం తెలుగు వారిని రెండుగా తెగకోసి, ఓ ప్రాంతానికి అన్యాయం చేస్తే, వారు తెచ్చుకొని పాలించుకొంటుంటే, అడుగడుగునా అడ్డుపడ్డారు. దేశం ఆశ్చర్య పోయేలా అమరావతి నుండి పార్లమెంట్ సభల వరకు వెన్ను చూపకుండా పోరాడాడు. అంతా ఏకమయ్యి దించేశారు. ఆ గడ్డను అంధకారమయం చేసి & బానిసల్లా హీనంగా చూస్తున్నారు. ఆయన పక్షంలోని వారి పోరాటానికి జడిసి అణిచివేత చేస్తున్నారు. అయినా తిరగబడుతున్నారు. ఒక భాగం చూశాం. ఇంకా నడుస్తోంది. రోజూ చూస్తున్నాం. ఢిల్లీకి ఎదురు చెప్పకుండా వుండి వుంటే, ఆంధ్రా కోసం పోరాడకుండా వుండి వుంటే ఆయన రాజే అంటున్నారు.


నారా తన గడ్డ కోసం పోరాడి, మోసపోయి, అదే గడ్డ ఏడుస్తుంటే ఓదార్చుతున్న ఆయన పోరాటం ఒక స్ఫూర్తి. టికెట్టు లేని పోరాటం కాబట్టి ఈ ప్రజా పాలేరు కన్నా ఆ 11 రూపాయల ఊహా పాలేరు చిత్రం బావుంది అంటున్నారు. ఈ పాలేరు వెనక వుండి వుంటే లక్షలాది కోట్ల విలువైన అమరావతి ఓ ఆకృతిని సంతరించుకొంటూ వుండేది. పోలవరం మరో 30 శాతం అయ్యి రాష్ట్రం సస్యశామాలంగా మారేది. ప్రకృతి ఆహారం పండించుకొంటూ, ఇక్కడే సగర్వాంగా ఉద్యోగాలు చేసుకొంటూ ఆనందాంధ్రప్రదేశ్ అయ్యేది. కీయా లాంటి సంస్థలతో మరో వేలకోట్ల విలువైన కొరియా అయ్యేది కరువు ప్రాంతాలు. మెట్రోలు గట్రా వచ్చేది. నిజమైన పాలేరును కళ్లముందు చూడలేక తెరమీది ఊహాపాలేరుకు ఆహా అంటున్న జనానికి జేజేలు. మీ నిజ జీవితంలో పోరాటాలను చూసి అలిసిపోతే, తప్పులేదు వినోదం కోసం వెళ్లడం. ఏమాత్రం బాధ్యత లేకుండా కొడికడుతున్న కొంపను గాలికి వదిలేసి ఊహల్లో బ్రమల్లో బ్రతక్కండి..


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
రాష్ట్ర స్థాయి పోటీలు
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
వైసీపీ లో చేరికలు
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వెంకటేశ్వర కాలనీ లో ఈరోజు బస్తీ దవాఖానను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనలో భాగంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు దవాఖానాలు చేరువయ్యేలా ఉండాలని ప్రభుత్వ సంకల్పంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఒక్క రోజు లో జి.హెచ్.యం.సి పరిధి లో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 బస్తీ దవాఖానాల ప్రారంభం ప్రస్తుతం జి.హెచ్.యం.సి పరిధిలో 123 బస్తీ దవఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాల తో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి. ఒక్కో బస్తీ దవఖాన లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రతి ఒక్కరు బస్తీ దవాఖాన సేవ‌ల‌ను వినియోగించుకోవాలి. బస్తీ దవాఖానల్లో ఆధునిక వైద్య పరికరాలు ఉంటాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ దవాఖానాలు ఉంటాయి. మన తెలంగాణ ను ఆరోగ్య తెలంగాణ గా మార్చుకుందాం. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు,యం.యల్.సి నవీన్ రావు గారు,యం.యల్.ఏ అరెకపూడి గాంధి గారు తదితరులు పాల్గొన్నారు.
Image