వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్!*

*వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్!*


👉వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై కోటంరెడ్డి దాడి


👉పోలీసులకు ఫిర్యాదు చేసిన సరళ


👉విచారణ జరిపి అరెస్ట్ చేసిన పోలీసులు


వెంకటాచలం ఎంపీడీవో సరళ కేసు విషయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. కోటంరెడ్డి తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని, దాడి చేసేందుకూ ప్రయత్నించారని నిన్న సరళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ జరిపి, కోటంరెడ్డి దాడి చేశారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని తేల్చారు. ఆపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 


కాగా, నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో జీవీఆర్ కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిల లేఔట్ కు వాటర్ కనెక్షన్ ఇచ్చే విషయమై ఎంపీడీవో, కోటంరెడ్డి మధ్య వివాదం తలెత్తిందన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్, చట్టం ముందు అందరూ సమానమేనని, అనుచితంగా ప్రవర్తించే వారు ఎవరైనా ఉపేక్షించ వద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ కు స్పష్టం చేయడంతో ఆపై కోటంరెడ్డి అరెస్ట్ కు పోలీసులు కదిలినట్టు తెలుస్తోంది.