జీతాల కోసం కార్పొరేషన్ రెసోర్స్ పెర్సన్స్ మనోవేదన

జీతాల కోసం కార్పొరేషన్ రెసోర్స్ పెర్సన్స్ మనోవేదన


*రేపు ధర్నాకు సన్నద్ధం*


పెండింగులో ఉన్న 5 నెలల వేతనాలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు 5 నెలల నుండి జీతాల కోసం ఎదురు చూస్తున్న రిసోర్స్ పర్సన్స్
430 మంది రెసోర్స్ పర్సన్స్ కార్పొరేషన్ లో విధుల నిర్వహణ
వార్డు వలంటీర్ల కన్న ముందు నియామకం
నిన్ను కాక మొన్న విధుల్లో చేరిన వార్డు వలంటీర్ల కు చేరిన నెలకే వేతనాలు జారీ, పెంపు జరిగింది. కానీ వీరికి మాత్రం ఇంతవరకు వేతల పెంపు సంగతి అలా ఉంచితే అసలు వేతనలే అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
430 మంది రెసోర్స్ పర్సన్స్ మహిళలు కావడంతో వారి కుటుంబం నుంచి జీతాల కోసం ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటు ఎవరికి చెప్పుకోవలో అర్ధం కాక  మనోవేదన అనుభవిస్తున్నారు.