కవి బివివి కి “కవి మిత్ర” సాహిత్య అవార్డు ప్రధానము


కవి బివివి కి “కవి మిత్ర” సాహిత్య అవార్డు ప్రధానము


విజయవాడ కు చెందిన 'కవితాలయం' సాహిత్య-సామాజిక సేవాసంస్థ వారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భముగా విజయవాడ కోడూరి కళ్యాణమండపము నందు 4-10-19న ఏర్పాటుచేసిన కార్యక్రమములో అమలాపురమునకు చెందిన కవి, సాహితీవేత్త శ్రీ బివివి సత్యనారాయణ ను “కవిమిత్ర” బిరుదుతో ఘనముగ సత్కరించారు. 
బివివి సత్యనారాయణ గారు కళా సాహిత్య సాంఘిక సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగ , ఇతర సాహితీ సంస్థలతో కలసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందులకు గాను ఈ పురస్కారము లభించినట్లు తెలియజేసారు. కవితాలయం గౌరవ జాతీయ అధ్యక్షులు గౌ. లింగుట్ల వెంకటేశ్వర్లు, ఏపీ ప్రభుత్వ సాహిత్య అకాడమీ రాష్ట్ర సభ్యులు డా. కత్తిమండ ప్రతాప్, హైకోర్టు న్యాయవాది చేబ్రోలు యజ్ఞనారాయణ, కోకా విమలకుమారి, కవయిత్రి మందు యనమదల, టి. పవన్ కుమార్, హోతా నవీన్ గార్ల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ 'చెట్టు నా నేస్తం' అనే కవితాగానం సభికుల హర్షధ్వానాల మద్య చదివి వినిపించారు.
తనకు కవిమిత్ర అవార్డు రావడం పట్ల తెలుగు మాట అధ్యక్షులు శినారా, నల్లా నరసింహమూర్తి, లయన్ సాపే బాలరవి, తరిట్ల రాజేష్, రిటైర్డ్ జడ్జి మోర్త సత్యనారాయణ , పద్మాజీరావు తదితరులు అభినందనలు తెలియజేసారు.


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
చీకట్లో బావిలోకి దూకి శవాన్ని వెలికితీసిన సిఐ
6వ తేదీ టీడీపీ కార్యాలయం ప్రారంభం