వేద‌పండితుల‌కు పారితోషికం అంద‌జేత..

వేద‌పండితుల‌కు పారితోషికం అంద‌జేత..


 ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి 6వ అంతస్థులో నిర్వహించిన వేద విద్వత్సభ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరై అర్ఛకులకు, వేద పండితులకు పారితోషికాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర  దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనసభ్యులు మల్లాది విష్ణు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి యం.వి.సురేష్‌బాబ తదితరులు పాల్గొన్నారు.