నిధుల మళ్లింపు కేసులో అరెస్టైన టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌

నిధుల మళ్లింపు కేసులో అరెస్టైన టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. 18 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు కేసులో... శనివారం (అక్టోబర్5, 2019) సాయంత్రం రవిప్రకాశ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు ప్రవేశ పెట్టారు.