ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్: భట్టి
ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. అసలు ప్రభుత్వం ఉందా కార్మికుల సమస్యలు పట్టవా అని నిలదీశారు. ఆనాడు ఉద్యమం సమయంలో తెలంగాణ సకల జనుల సమ్మె సమయంలో ముందు భాగంలో ఆర్టీసీ కార్మికులుఉన్నారని చెప్పారు. ఆరోజు న్యాయపరమైనది ఈరోజు చట్ట విరుద్ధం ఎలా అవుతుందన్నారు. సమ్మె చేసే హక్కు ప్రతి కార్మికుడి హక్కు దానిని హరించే హక్కు ఏ ప్రభుత్వం కు లేదన్నారు. ఆర్టీసీని ప్రవైట్ పరం చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఆ ప్రవైట్ వ్యక్తుల వివరాలు కూడా త్వరలో తెలుపుతామన్నారు. కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు వారికి పూర్తి మద్దతు గా అండగా ఉంటామని చేప్పారు. ఇప్పుడు సమ్మె చేస్తున్నది కూడా తెలంగాణ బిడ్డలే దేనికి బయపడరు లాఠీలకు లూటీలకు బయపడేవారు తెలంగాణలో లేరని స్పష్టం చేశారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ మాటలు సహోదరణగా వీడియో చూపిన భట్టి విక్రమార్క
ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్: భట్టి