జీతాల కోసం రోడ్డెక్కిన ఉద్యోగులు

జీతాల కోసం రోడ్డెక్కిన ఉద్యోగులు


_కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో కార్వే కార్యాలయం ఎదుట మళ్లీ ఉద్యోగులు గురువారం ఉదయం జీతాల కోసం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా కార్వే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు మాట్లాడుతూ కార్వే ద్వారా 1100 కాల్ సెంటర్ నుంచి పనిచేస్తూ 24 గంటల పాటు షిఫ్టుల వారీగా వెట్టిచాకిరి చేస్తున్నామని పేర్కొన్నారు. గత రెండు నెలలుగా వందలాది మంది ఉద్యోగులకు కనీస నెల వేతనం 8,500 రూపాయలు కూడా చెల్లించడం లేదని ఉద్యోగినులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్వే యాజమాన్యం ఉద్యోగుల ఆకలి కేకలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో కూడా దీని గురించి ఆందోళన చేసినా ఫలితం లేదన్నారు. కార్వేలో కొందరు అధికారులు..పై ఉద్యోగులు... తమ నానారకాలుగా వేధిస్తున్నారని ఉద్యోగం తీసేస్తాం అంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సిఐటియు నేత మహేష్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా కార్వేలో కొందరు ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తమకు డబ్బులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీనిపై ఆందోళన చేస్తున్న వారు మాట్లాడుతూ జీతాలు చెల్లించే వరకు ఆందోళనలు కొనఇస్తామని కార్వే లోని మహిళా ఉద్యోగినులు స్పష్టం చేశారు._


*ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న జిల్లాలోని మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాల్సి ఉంది*