నారా లోకేష్ దసరా పండగ శుభాకాంక్షలు


తెలుగు ప్రజలందరికీ టీడీపీ నేత నారా లోకేష్ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. మంచి విజయం సాధించాలనే స్ఫూర్తి విజయదశమి మనకు అందిస్తుందని ఎల్లప్పుడూ సత్యానికే అంతిమ విజయం సిద్ధిస్తుందని వ్యాఖ్యానించారు. తెలుగు లోగిళ్లలో దసరా పండగ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని నారా లోకేష్‌ చెప్పారు.