శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. సోమవారం ఉదయం దేవదేవుడి మహారథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవితో కలిసి విశ్వరూపంలో మలయప్పస్వామి వజ్రాలు పొదిగిన కిరీటం, శంఖు, చక్రాలు, తిరువాభరణాలు ధరించి ఊరేగారు. రథం కదులుతున్న సమయంలో భక్తుల గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. రాత్రిమలయప్పస్వామి కల్కి అవతారంలో అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం చక్రస్నానం అనంతరం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.