పీసీసీ కార్యదర్శి వంటెద్దు బాబీ కి మాతృ వియోగం


పీసీసీ కార్యదర్శి వంటెద్దు బాబీ కి మాతృ వియోగం
.... 
అమలాపురానికి చెందిన  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి వంటెద్దు బాబీ  మాతృమూర్తి వంటెద్దు హైమావతి(72) మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. హైమావతి కి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. బాబీ మాతృమూర్తి బౌతిక కాయాన్ని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, కాంగ్రే స్ నాయకులు కల్వకొలను తాతాజీ, అయితాబత్తుల సుభాషిణి, సెహన్ షా, 
వైసిపి నాయకులు వంటెద్దు నాయుడు, కొర్లపాటి కోటబాబు, జనసేన నాయకులు ఏడిద శ్రీను, యాళ్ల బాబీ, తెదేపా నాయకులు మాజీ మునిసిపల్ చైర్మన్ యాళ్ల సతీష్ తో పాటు పట్టణంలోని పార్టీలకు అతీతంగా ప్రముఖులు సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబ సబ్యులకు సంతాపం ప్రకటించారు.