గవిమఠం వేళాలు నిలిపివేత.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఈ నెల 18 ,19 తేదీల్లో జరగాల్సిన గవిమఠం స్థలాల వేళాలను మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ నేత విశ్వేశ్వరరెడ్డి గారి చొరవతో తాత్కాలికంగా నిలిపివేశారు.ఇటీవల గవిమఠం వ్యాపారులు విశ్వేశ్వరరెడ్డి గారిని కలిశారు. దీనితో స్పందించిన ఆయన జిల్లా కలెక్టర్ ను కలిశారు.దాదాపు 400 కుటుంబాలు రోడ్డున పడతాయని ప్రత్యామ్నాయ అంశాలపై దృష్టి పెట్టాలని విశ్వేశ్వరరెడ్డి గారు కలెక్టర్ విన్నవించారు. దీంతో కలెక్టర్ గారు వేళాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.దీనిపై వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.