నిత్యాన్నదానమనకు తనవంతు సహాయంగా పి.ఎస్. పార్థసారధి గారి దంపతులు లక్ష రూపాయల విరాళం.


  విజయవాడ నగరం లోని                స్థానిక ముత్యాలంపాడు లో వెలసియున్న శ్రీ షిరిడి సాయి బాబా మందిరములో జరుగుతున్నటువంటి నిత్యాన్నదానమనకు తనవంతు సహాయంగా పి.ఎస్. పార్థసారధి గారి దంపతులు లక్ష రూపాయల చెక్కును మందిర గౌరవాధ్యక్షులు  శ్రీ పి.గౌతమ్ రెడ్డి గారి చేతులమీదుగా మందిరమునకు అందజేసినారు.
       దాత మాట్లాడుతూ మందిరంలో నిర్వహిస్తున్నటువంటి నిత్యాన్నదానం, ఆధ్యాత్మిక కార్యక్రమములు మరియు సామాజిక సేవా కార్యక్రమములు చూసి ఎంతో ఆనందం కలిగినది, అందుచేతనే నిర్విఘ్నంగా కొనసాగుతున్న టువంటి నిత్యాన్నదాన కార్యక్రమం నకు తమవంతుగా ధన రూపేణా సహాయం అందించినాము..
         మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతూ మందిరంలో ఏ కార్యక్రమం తలపెట్టినా భక్తుల సహాయ సహకారాలు మరువలేనివి వారికి ఎన్నడూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాము అని తెలియజేసినారు.
     ఈ కార్యక్రమములో మందిర గౌరవాధ్యక్షులు పి. గౌతమ్ రెడ్డి గారు మరియు మందిర సభ్యులు పాల్గొన్నారు.