తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని సీకే కన్వెన్షన్ పక్కనే మన పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నిర్మాణం పూర్తి అయ్యింది.స్వస్తి శ్రీ చాంద్రమాన వికారినామ సంవత్సరం మార్గశిర శుక్ల దశమి ఉత్తరాభాద్ర నక్షత్రయుత మకరలగ్న పుష్కరాంశములో తేదీ 6-12-2019 శుక్రవారం ఉదయం 10.03 నిమిషాలకు కార్యాలయ ప్రారంభోత్సవానికి శుభముహూర్తంగా పండితులు నిర్ణయించారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,నాయకులు, అభిమానుల మధ్య అంగరంగవైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నాం. ప్రతీ ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరై,ఈ శుభసందర్భంలో పాలుపంచుకోవాలని నా ప్రేమపూర్వక ఆహ్వానం.