హిందువుల మనోభావాలు పరిరక్షించాలి : నల్లా పవన్‌కుమార్‌


హిందువుల మనోభావాలు పరిరక్షించాలి : నల్లా పవన్‌కుమార్‌


అమలాపురం : 
గుంటూరులోని కొల్లి శారదా మార్కెట్‌ ఎదుట ఏళ్ల నాటి కనకదుర్గమ్మ దేవాలయాన్ని   ముందస్తు సమాచారం లేకుండా కార్పొరేషన్‌ సిబ్బంది అర్థరాత్రి సమయంలో ధ్వంసం చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్‌ అన్నారు. హిందుత్వాన్ని ధ్వంసం చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని.... దీనిలో భాగంగానే కనకదుర్గమ్మ దేవాలయాన్ని కూల్చివేశారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు పుష్కరాల సమయంలో ఇలాంటి పనులే చేశారని, ఆయనకు రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఇటువంటి చర్యలు ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. హిందువుల మనోభావాలను పరిరక్షించాలని డిమాండ్‌ చేసారు. మతాల మధ్య విద్వేషాలు తలెత్తకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.