అఖిలపక్షం ఏర్పాటుతో అన్ని పార్టీల ద్వారా పోరాటాన్ని ఉధృతం చేస్తాం: ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్.


 అఖిలపక్షం ఏర్పాటుతో అన్ని పార్టీల ద్వారా పోరాటాన్ని ఉధృతం చేస్తాం: ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్.పామర్రు కేంద్రంగా  పామర్రు నియోజకవర్గ  పంచాయతీరాజ్ ఛాంబర్  సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు  ఎమ్మెల్సీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్రప్రసాద్.
కేంద్రప్రభుత్వం ఉపాధిహామీ నిధులు 2500 కోట్ల రూపాయలు విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులు, ఎంపిటిసిలకు  విడుదల చేయకుండా అన్యాయం చేస్తూ, ఆ నిధులను దారిమళ్లించి  తమ స్వంత పథకాలకు, నవరత్నాల  పథకంకు వాడుకుంటుంది.
ఈ రకంగా ఉపాధిహామీ *నిధులను దారి మళ్ళించడం, చట్ట విరుద్ధం* , రాజ్యాంగ వ్యతిరేకం. కావున అన్ని రాజకీయ పార్టీల నాయకులు *అఖిలపక్షంగా* ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వ *నిరంకుశత్వ వైఖరిపై* పోరాడాలని *ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్* గారు విజ్ఞప్తి చేశారు.
సర్పంచులు, ఎంపిటిసిలు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరిని గ్రామ మండల స్థాయిలో విస్తృత ప్రచారం చేసి, *అఖిలపక్ష కమిటీలు* ఏర్పాటు ద్వారా *పోరాటం ఉదృతం* చేయాలని, తద్వారా మన *హక్కులను కాపాడుకుందాం* అని *ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్* గారు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పామర్రు మండలంకు చెందిన *మహిళా ఎంపిటిసి* , ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని, పేద కుటుంబానికి చెందిన మహిళ అని తెలిసిన ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు, మరియు మిగతా నాయకులు *15,000* /- రూపాయలను *ఆర్థిక సహాయాన్ని* అందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపిటిసిల సంఘం అధ్యక్షుడు కాసరానేనీ మురళీ గారూ, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరంకి గురుమూర్తి గారు, మాజీ సర్పంచ్ జక్కా శ్రీనివాస్, మాజీ జడ్పీటిసి మోటూరు వెంకట సుబ్బయ్య, పెదపారుపూడి మాజీ ఎంపిపి కాజా విజయలక్ష్మి, మాజీ మొవ్వ ఎంపిపి మంగమ్మ, పామర్రు వైస్ ఎంపిపి లాజరస్ గారు, మాజీ ఎంపిపి గొట్టిపాటి లక్ష్మిదాస్  తదితరులు పాల్గొన్నారు.


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
చీకట్లో బావిలోకి దూకి శవాన్ని వెలికితీసిన సిఐ
6వ తేదీ టీడీపీ కార్యాలయం ప్రారంభం