ఆరునెల‌ల్లో ప్ర‌జ‌ల్ని ముంచేసిన ముఖ్య‌మంత్రి 

ఆరునెల‌ల్లో ప్ర‌జ‌ల్ని ముంచేసిన ముఖ్య‌మంత్రి 
-వరద ముంచెత్తితే..నిర్లజ్జగా ఇజ్రాయేల్ చెక్కేసిన జగన్
-అట్నుంచి వచ్చి కేంద్రం కాళ్లు పట్టుకునేందుకు వెళ్లిన సీఎం
-ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాల హెచ్చరికలు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం
-పోలవరం ముంపు ప్రాంతీయులను తరలించకపోవడంతో జలదిగ్బంధంలో జనం
-టీడీపీ హయాంలో తుఫాన్ హెచ్చరికలతోపాటు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లిన చంద్రబాబు


ప్రతీ సోమవారం పోలవరం అంటూ ప్రత్యేకంగా పేరుపెట్టీ మరీ ఆంధ్రుల జీవనాడి పోలవరంను దాదాపు 70 శాతం పూర్తిచేసిన దార్శనికుడు చంద్రబాబును కాదని...ప్రతీ శుక్రవారం జైలుకెళ్లే జగనే మాకు కావాలి..జగనే సీఎంగా రావాలి అని జనం జేజేలు కొట్టారు. తీరా ఆయన వచ్చారు. నేను ఆరునెల‌ల్లో మంచి ముఖ్య‌మంత్రిని అనిపించుకుంటాను అని ప్ర‌తిన‌బూనాడు. ఆర్నెళ్ల‌లో ఏ ఒక్క మంచి చేయ‌లేదు స‌రిక‌దా! అంద‌రినీ, అన్నిరంగాల‌నూ ముంచే ముఖ్య‌మంత్రిగా నిలిచాడు.  మింగలేని మంగళవారాన్ని అని నేరుగా తన చేష్టలతో చెప్పకనే చెప్పారు. గోదావరి ఎగువ పరీవాహక ప్రాంతాలలో వానలు పడితే పోలవరం ముంపు గ్రామాలకు ఎప్పుడూ ముంపు సమస్య ఉంటుంది. దీంతోపాటు లంక గ్రామాలు నీటమునిగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఇది ఒక గ్రామ వీర్వోని అడిగినా చెప్పే సమాధానం. వీటిని ఎదుర్కోవాలంటే వాతావరణ హెచ్చరికలు అనుక్షణం పరిశీలిస్తూ, పెరుగుతున్న నదీ ప్రవాహాలను నిపుణులతో వేసిన అంచనాలతో బేరీజు వేస్తూ..పునరావాస శిబిరాలకు నిర్వాసితులను తరలించే ముందస్తు సహాయకచర్యలు తీసుకోవాలి. ఇటు రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రికి తెలుసు. మరోవైపు అల్పపీడనం, వాయుగుండం కారణంగా భారీవర్షసూచనలు తెలుసు..కానీ గోదావరి వరద ముంచెత్తుతుందనీ తెలుసు. ఇవేమీ పట్టించుకోకుండా.