వ్యాయామ విద్య పితామహుడు హెచ్ సి బక్  ఘన నివాళి

వ్యాయామ విద్య పితామహుడు హెచ్ సి బక్  ఘన నివాళి


 శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఒప్పంద , పొరుగు సేవల అధ్యక్షులు గుండ బాల మోహన్


శ్రీకాకుళం జిల్లా  శ్రీకాకుళం గ్రామీణ మండలం లో పాత్రునివలస గ్రామంలో సోమవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా ఒప్పంద, పొరుగు సేవల వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు గుండ బాల మోహన్ భారతదేశ వ్యాయామ విద్య పితామహుడైన హెచ్ సి బక్ జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   హెచ్ సి బక్ నవంబర్ 25 ,1884లో అమెరికా దేశంలో  లివర్పూల్ పట్టణంలో జన్మించారు, చిన్నప్పట్నుంచి క్రీడలు అంటే  ఇష్టమని  అని కొనియాడారు, ఆయన ఆటల్లో  పాఠశాలలో ,కళాశాలలో క్రీడల్లో ముందుండే వారని తెలిపారు, అయితే ఆయన అక్కడ వ్యాయామ విద్యను అభ్యసించి. భారతదేశంలో మదరాసులో వై.యం.సి.ఏ కళాశాలలు స్థాపించి వ్యాయామ విద్యను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనని కొనియాడారు, ఇతను మద్రాసు ఒలంపిక్ కార్యదర్శిగా కూడా పనిచేశారు, వ్యాయామ విద్య ప్రతిష్ట పరచడానికి  చేసిన కృషి ఎనలేనిది అని తెలిపారు, అప్పట్లో భారతదేశంలో వ్యాయామ విద్య అనేది నామమాత్రంగా ఉండేదని దానిని పూర్తి స్థాయిలో ఆధునీకరించిన ఘనత ఆయనే దేనని తెలిపారు, భారతదేశంలో వై ఎం సి ఏ వ్యాయామ విద్య కళాశాలలో డిప్లమో లు పీజీ కోర్సులు ఈయన ప్రవేశపెట్టారు. ఈయనకు ఘన నివాళి అర్పించిన వారిలో జిల్లా ఒప్పంద, పొరుగు సేవల, కేజీబీవీ,వ్యాయామ ఉపాధ్యాయ సంఘ సభ్యులు అయినా  సిహెచ్ శ్రీనివాస్,ఎల్ డిలేశ్వరావు, రామారావు, అప్పలరాజు, కె నరేష్, బి రమేష్, శేఖర్, లక్ష్మణ్, రవణమ్మ, సన్యాసమ్మ,, ప్రియాంక, రాజేశ్వరి, జాన్ ఈశ్వర్, ఢిల్లీ శ్వరి, భారతి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు