గుంటూరు రూరల్ జిల్లా ఎస్పి శ్రీ సీహెచ్.విజయారావు,IPS., జనరల్ విజిట్.

 


ఈ రోజు గుంటూరు రూరల్ జిల్లా ఎస్పి శ్రీ సీహెచ్.విజయారావు,IPS., జనరల్ విజిట్ లో భాగంగా  పలనాడు లోని గురజాల సబ్ డివిజన్ నందు కొన్ని ముఖ్యమైన పోలీస్ స్టేషన్ లను  సందర్శించి ఆయా స్టేషన్ లోని  అధికారులకు మరియు సిబ్బంది కి సలహాలు, సూచనలు ఇవ్వటం జరిగింది.


ఈ సందర్భముగా ముందుగా గురజాల లోని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ ని సందర్శించిన ఎస్పి గారు సబ్-డివిజన్ ఫరిదిలో ఏమైనా శాంతిభద్రతల సమస్యలు  ఉన్నాయా అని  డిఎస్పీ శ్రీహరిబాబు గారిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాక సబ్-డివిజన్  ఫరిదిలో ప్రస్తుతం ఉన్న  సమస్యాత్మక  గ్రామాలు వాటి వివరాలు, ఆ గ్రామాలలో ప్రస్తుత పరిస్థితులు,  గురజాల సబ్-డివిజన్ ఫరిది లో ఉన్న పోలీస్  స్టేషన్ల పనితీరును  మరియు అధికారుల పనితీరును  అడిగి తెలుసుకున్నారు. 


గురజాల సబ్-డివిజన్ ఫరిదిలో  ఉన్న కొన్ని సమస్యాత్మక గ్రామాలలో ఇటివల జరిగిన కొన్ని పరిణామాలను దృస్టిలో ఉంచుకోని  పలనాడు ప్రాంతంలో  ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు  తలెత్తకుండా  చూడడంలో పోలీస్ లు ఏ విధంగా వ్యవహరించాల్సిన తీరును ఎస్పి గారు తెలియజేసారు.  
తరువాత ఎస్పి గారు గురజాల పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ లో అన్ని రికార్డ్స్ సరిగా నిర్వహిస్తునారా   లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.అంతేకాక గురజాల ఫరిది లో ఉన్న రౌడీషీటర్ల వివరాలు మరియ వారు కౌన్సిలింగ్ కు సరిగా హాజరారుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు,ముఖ్యంగా  “స్పందన”  లో వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిచ్చి వాటిని  వెంటనే పరిష్కరించి భాదితులకు న్యాయం చెయ్యలని అధికారులను ఆదేశించారు, గురజాల టౌన్ నందు రాత్రిపూట గస్తీ వివరాలు వాటి అమలు తీరును, భద్ర వాహనాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. గురజాల టౌన్ ఫరిది లో ముఖ్యంగా గుట్కా అమ్మకందారులపై ప్రత్యేకమైన నిఘా ఉంచి గుట్కా అమ్మకందారులపై కేసులు నమోదుచెయ్యాలని,అంతేకాకుండా మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట స్థావరాలపై గట్టి నిఘా ఉంచాలని స్టేషన్ లోని అధికారులు మరియు  సిబ్బంది ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా నిజాయితి గా పనిచెయ్యాలని సూచనలు  చేసారు.


తదుపరి నాగార్జున సాగర్ చెక్ పోస్ట్ ను సందర్శించి అచ్చటి అధికారులకు మరియు సిబ్బందికి దిశానిర్దేశం చేసినారు.నాగార్జున సాగర్ డాం ను సందర్శించి అచ్చటి విశేషాలు అడిగి తెలుసుకున్నారు.


ఈ కార్యక్రమం లో గురజాల డిఎస్పీ శ్రీహరి బాబు గారు, గురజాల టౌన్ సీఐ దుర్గ ప్రసాద్, గురజాల రురల్ సర్కిల్లో సీఐ కోటేశ్వరరావు, మాచర్ల రురల్ సీఐ భక్తవత్సల రెడ్డి, ఎస్ ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.