నెల్లూరులో జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమీక్ష

    నెల్లూరులో జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమీక్షా కమిటి సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి వారి నియోజకవర్గాల్లోని రైతాంగ సమస్యలపై మాట్లాడారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి ముందుగానే మద్దతు ధరను ప్రకటిస్తే దళారుల నుండి రైతులను కాపాడిన వారమవుతామని చెప్పారు. పంటలను నిల్వ చేసుకోవడానికి గోదాముల సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మట్లాడుతూ ఎన్.ఎల్.ఆర్ - 34449 రకం వరి విత్తనాలపై రైతులు ఆసక్తి కనబరుస్తున్న దృష్ఠ్యా వాటి నిల్వలను పెంచాలని సూచించారు.