గురజాల నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పాల్గొన్నారు. దాచేపల్లి మండలం లోని పొందుగుల, బట్రుపాలెం గ్రామాల్లో గ్రామ సచివాలయాన్ని, వాటర్ ప్లాంట్ లను ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారితో కలసి ప్రారంభించారు. గ్రామస్థులు, నాయకులు పూలతో ఎంపీ, ఎమ్మెల్యే లకు ఘన స్వాగతం పలికారు. రెండు గ్రామాల్లో భారీగా ర్యాలీ నిర్వహించారు. బట్రు పాలెం లో జరిగిన తిరునాళ్ళ కార్యక్రమంలో పాల్గొని..ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ..గ్రామ సచివాలయం వ్యవస్థతో రాష్ట్రం లో ఉద్యోగ విప్లవం వచ్చింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి. గురజాల ప్రాంతం అభివృద్ధి కి కృషి చేస్తున్నాం. గురజాల నియోజకవర్గంలో మెడికల్ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. దీని ఏర్పాటుకి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి గ్రామంలో మంచి నీటి సదుపాయం మెరుగుపడుతుంది. సాగు, తాగు నీరు అందించటమే ప్రథమ లక్ష్యం. గోదావరి జలాలను కృష్ణ నదిలో కలిపి..పులిచింతల ప్రాజెక్టు కు నీటిని నింపితే మేలు జరుగుతుందని సీఎం దృష్టికి తీసుకు వెళ్ళాం. మారు మూల గ్రామాల్లో కూడా పూర్తి స్థాయి అభివృద్ధిని చేస్తామని..అన్నారు. ఈ కార్యక్రమంలో..మాజీ ఎమ్మెల్సీ కృష్ణా రెడ్డి గారు, జంగం కోటయ్య గారు పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు